29 April, 2026 | 1:35 PM

ఆమనగల్లు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి

28-04-2026 01:41 AM

నలుగురి ఎంపిక ఏకగ్రీవం

ఆమనగల్లు, ఏప్రిల్ 27 (విజయక్రాంతి):ఆమనగల్లు మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ సోమవారం ఉదయం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ సభ్యులు నలుగురు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు 7 మంది,బీజేపీ కౌన్సిలర్ ఆరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరూ హాజరయ్యారు.ప్రభుత్వ నియమ,నిబంధనల మేరకు పారదర్శకంగా జరిగిన ఈ ప్రక్రియలో వివిధ వర్గాల నుంచి జనరల్ (మహిళ) నుంచి కండే సీతారాములమ్మ,జనరల్ స్థానం నుంచి చుక్క అల్లాజిగౌడ్,మైనారిటీ (మహిళ) విభాగం నుంచి హలీమా బేగం,మైనారిటీ జనరల్ స్థానం నుంచి అబ్దుల్ ఖాదర్ లు ఎన్నికయ్యారు.

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి..

మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని కమిషనర్ శంకర్ నాయక్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన సభ్యులు పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా ఉంటూ, కౌన్సిల్తో సమన్వయంగా పనిచేస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కౌశల్ గా ఎన్నికైన వారిని పలువురు కౌన్సిలర్లతోపాటు, బీజేపీ రాష్ట్ర నేత ఆచారి, వైస్ చైర్మన్ గీత  లు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటయ్య, మహేష్, నిరంజన్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.