18 August, 2026 | 12:30 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

ఘనంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

28-04-2026 01:40 AM

శంకర్ పల్లి: ఏప్రిల్ 2౭ (విజయక్రాంతి): బి ఆర్ ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శంకర్పల్లి మండలంలో, మున్సిపల్ పరిధిలోని వార్డులలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్  పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు.

మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు బద్దం శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లు మాల చిన్న నరసింహులు, డి. గోవర్ధన్ రెడ్డి, శంకర్ పల్లి ఏఎంసి మాజీ చైర్మన్ ఎన్. మాణిక్ రెడ్డి, మహాలింగాపురం మాజీ ఎంపీటీసీ బి. యాదగిరి, నాయకులు వాసుదేవ్ కన్నా, అడ్వకేట్ ఉపేం దర్ రెడ్డి, కౌన్సిలర్లు విజయ్ కుమార్, మహేందర్ రెడ్డి, శేరిగూడ సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచులు వెంకట్ రెడ్డి, శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ గండేటి శ్రీనాథ్ గౌడ్, బి ఆర్ ఎస్ వి నాయ కులు నరసింహారెడ్డి, బాబు, శ్రీకాంత్ రెడ్డి, మన్నే లింగం ముదిరాజ్, చారి, మైనారిటీ నాయకులు రషీద్ ఖాన్, మునీర్ ఖురేషి, సలీం పాషా, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.