25 March, 2026 | 10:19 PM

అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఎన్నిక

25-03-2026 08:42 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఈనెల 30న  రానున్న ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సమావేశం ఏర్పాటు చేసినట్లు అంబేద్కర్ సంఘం నేతలు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో ఏప్రిల్ 14న జరిగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావు అంబేద్కర్ 135వ జయంతోత్సవంతోపాటు జగజీవన్ రామ్ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుటకు తీర్మానించారు.

అందులో భాగంగానే ఈనెల 30న స్థానిక వైశ్య భవన్ లో ఎస్సీ ఎస్టీ మాల మాదిగ ఉపకులాలతోపాటు ముస్లింమైనార్టీ నాయకులు యువకులు అంబేద్కర్ అభిమానులు ప్రజాప్రతినిధులు రిటైర్డ్ ఎంప్లాయిస్, ఎంప్లాయిస్, పెద్ద సంఖ్యలో హాజరై మహానీయుల ఉత్సవ వేడుకలలో భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు. అదే రోజు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీతోపాటు జయంతి కార్యక్రమాల విధానాలు చర్చించడం జరుగుతుందని, అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.