ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
* ఎస్టీయూ అసోసియేట్ అధ్యక్షులు హనుమంత రెడ్డి
అచ్చంపేట: ప్రభుత్వ పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని ఎస్టీయూ అసోసియేట్ అధ్యక్షులు హనుమంత రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అచ్చంపేట మండలం నడింపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అర్జునయ్య పదవి విరమణ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన జిపిఎఫ్, ఆరోగ్య బీమా, మెడికల్ బిల్లులను ఎన్నో ఏళ్లుగా ఆపడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చెల్లించి ఆదుకోవాలని, రెండో పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని కోరారు. విద్యావ్యవస్థలో కీలకమైన ఎంఈఓ, డిప్యూటీ డీఈవో, డైట్ లెక్చరర్ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. పదవీ విరమణ పొందిన జీహెచ్ఎంను ఘనంగా సన్మానించారు.




