14 August, 2026 | 9:20 PM

వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

14-08-2026 08:16 PM

బోధన్,(విజయక్రాంతి): సాలూర మండలంలోని జాడి జమాల్పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లవరపు సుందర్ రాజు కుమార్తె శౌరి నిహారిక వివాహం ఈ నెల 30న జరగనున్న సందర్భంగా వివాహ ఆహ్వాన పత్రికను బోధన్ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డికి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఈ సందర్భంగా మల్లవరపు సుందర్ రాజు దంపతులు హైదరాబాద్‌లోని ఇరువురు నేతల నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.