సీఎం సహాయనిది LOC అందించిన ఎమ్మెల్యే
23-08-2026 05:09 PM
ఉట్నూర్, ఆగస్టు 23(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం బుద్దనగర్ కి చెందిన కాంబ్లే జయశ్రీ గారు గుండె సమస్యతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం సహాయ నిధి నుండి ఐదు లక్షల ఎల్లో సి అందజేశారు. శాస్త్ర చికిత్స చేయాలని డాక్టర్లు తెలపడంతో వెంటనే స్పందించిన వెడ్మ బొజ్జు పటేల్ చికిత్సకు అవసరమైన 5 లక్షల రూపాయల LOC నీ సీఎం సహాయనిధి నుండి ఆదివారం ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులకు అందించారు.నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుంది అని ఎమ్మెల్యే గారు అన్నారు. పేదలకు అండగా ప్రజా పాలన ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు.






