22 June, 2026 | 4:35 PM

4 నెలల్లో జేసీహెచ్‌ఎస్‌కు ఎన్నికలు

21-07-2024 12:19 AM

సహకార శాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ది జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (జేసీహెచ్‌ఎస్‌ఎల్)కు నాలుగు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర సహకార శాఖకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సొసైటీకి ఎన్నికలు నిర్వహించడం లేదం టూ బీ గోపరాజు ఇతరులు దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ఇటీవల విచారించారు. ప్రస్తుత కమిటీ సభ్యుల జోక్యం లేకుండా తుది ఓటర్ల జాబితాను రెడీ చేయాలని సహకార సంఘం అధికారిని ఆదేశించారు. ముగ్గురు సభ్యుల కమిటీ నివేదికతో ప్రమేయం లేకుండా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. నాలుగు నెలల్లోగా సహకార సంఘాల చట్ట నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్ శ్రీధర్‌రెడ్డి వాదించారు.