విద్యుత్ వృథా!
ఎంపీడీవో లేకున్నా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్ లతో వనరు వృధా
మన ఇంట్లో అయితే ఇలానే వ్యవహరిస్తామా?
పాపన్నపేట,సెప్టెంబర్28: విద్యుత్తును పొదుపుగా వాడండని ప్రభుత్వాలు(Governments) ప్రజలకు పదే పదే ఓ వైపు విజ్ఞప్తి చేస్తూ.. మరోవైపు విద్యుత్త్(Electricity Wastage) వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నాయి. కానీ అందుకు భిన్నంగా అదే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యుత్తు వృధా అవుతుంది. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలోని మీటింగ్ హాలులు ప్రజావాణి(Prajavani) నిర్వహించగా.. ఎంపీడీవో, ఎమ్మార్వో ఆయా శాఖల అధికారులు అక్కడే ఉన్నారు. ప్రజావాణికి వెళ్లే ముందు ఎంపీడీవో గదిలో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు ఆర్పి వేయాల్సి ఉండగా అలాగే వదిలేయడంతో గంటల తరబడి వృధాగా పోయింది. మన ఇంట్లో అయితే ఇలానే వ్యవహరిస్తామా అనే విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.