8 April, 2026 | 9:22 PM

విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె

08-04-2026 07:18 PM

ముకరంపుర,(విజయక్రాంతి): విద్యుత్ ఆర్టిసన్, అన్ మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు. 2016లో కేసీఆర్ ప్రభుత్వం ఎస్పీడీసీఎల్ హైదరాబాదులో ఉన్న అన్ మ్యాన్డ్ ఉద్యోగులను ఆర్టిసన్ ఉద్యోగులుగా ప్రకటించడం జరిగింది. కానీ ఎన్పిడిఎస్ఎల్ లో పనిచేసే ఉద్యోగులను ఈపీఎఫ్ లేని కారణంగా వీరిని అర్టిసన్ ఉద్యోగులుగా ప్రకటించలేదు. కానీ 2017 నుండి ఎన్పిడిఎస్ఎల్ లో కూడా వీరు ఈపీఎఫ్ కలిగి ఉంటున్నాం.

కాబట్టి మమ్మల్ని కూడా ఎన్పిడిఎస్ఎల్ హైదరాబాద్ లో ఎలాగైతే ఆర్టిసన్ ఉద్యోగులుగా ప్రకటించారొ అదేవిధంగా ఎన్పీడీసీఎల్ లో కూడా మమ్మల్ని అర్టిసన్ ఉద్యోగులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 15 రోజులుగా డివిజన్ కార్యాలయం ముందు, సర్కిల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వంట వార్పు మొదలగు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో, చివరికి మా సమస్యలు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ముక్తకంఠంతో తెలిపారు.