ఐటీ ఎగుమతుల్లో 11.3 శాతం వృద్ధి
- గతేడాది ఐటీలో 40,570 కొత్త ఉద్యోగాలు
- మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో జాతీయ సగటు కంటే తెలంగాణ మూడింతల వృద్ధి సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. 2024 మొద టి మూడు నెలల్లో జాతీయ ఐటీ ఎగుమతులు కేవలం 3.3 శాతం మాత్రమే వృద్ధి చెందాయని, తెలంగాణ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 11.3 శాతం వృద్ధి నమోదు చేసిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఏఐ సదస్సుకు కర్టెన్ రైజర్‌గా ‘నాస్కామ్’ బుధవారం గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
గత ఏడాది ఐటీ రంగంలో 40,570 కొత్త ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నాస్కామ్ రూపొందించిన ‘ఏఐ అడాప్షన్ 2.0’ నివేదికను విడుదల చేశారు. కృత్రిమ మేధను వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో అనేక సవాళ్లు ఉన్నాయని, వాటన్నిం టినీ ఎదుర్కొని ముందుకు వెళతామని చెప్పారు. హెల్త్‌కేర్, వ్యవసాయ రంగాల్లో ఏఐ వినియోగం విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.






