15 July, 2026 | 12:36 AM

అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

15-07-2026 12:00 AM

కొండ సైదులు గౌడ్

గరిడేపల్లి, జూలై 14: అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని గరిడేపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ, ఎలాంటి జీతభత్యాలు లేకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న విలేకరులకు ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని హామీలు ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయడం లేదన్నారు. కనీసం ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించి వారికి న్యాయం చేయాలని కోరారు.

ప్రభుత్వాలు మారుతున్నా విలేకరుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపే పరిస్థితి కనిపించడం లేదన్నారు.ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అర్హులైన జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వెంకటేష్, పాత్రికేయులు ముచ్చర్ల గోపాలకృష్ణ, మేకపోతుల వెంకటేశ్వర్లు, తాటికొండ లక్ష్మణ్, కుక్కడపు గురవయ్య, చాగంటి వీరయ్య, కడారి వెంకటేశ్వర్లు, కొలిపాక జగదీష్, మేకపోతుల శేఖర్, సండ్ర శివ, కుర్ర గోపి, వల్లపుదాసు జోష్ తదితరులు పాల్గొన్నారు.