19 May, 2026 | 5:51 PM

దేశం నుండి నక్సలిజాన్ని నిర్మూలించాం: అమిత్ షా

19-05-2026 04:46 PM

డెడ్ లైన్ కు ముందే.. మావోయిస్టు రహితంగా భారత్

మావోయిస్టురహితంగా బస్తర్

భయాందోళనలు వీడి స్వేచ్ఛదిశగా బస్తర్

ఛత్తీస్‌గఢ్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేతృత్వంలో నక్సలిజానికి వ్యతిరేకంగా పోటారం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shahఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బస్తర్ లో తొపాకుల హింస వీడి అభివృద్ధి చేయాలనేదే లక్ష్యమని తెలిపారు. గిరిజన సంప్రదాయాన్ని పరిరక్షించాలనేది ప్రధాని లక్ష్యమని వెల్లడించారు. డెడ్ లైన్ కు ముందే మావోయిస్టు రహిత భారత్ గా మారిందని వివరించారు. భయాందోళనల నుంచి స్వాతంత్రం దిశగా బస్తర్ పయనిస్తోందన్నారు. భవిష్యత్తులో బస్తర్ లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బస్తర్.. మావోయిస్టురహితంగా మారిందన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.."మార్చి 31, 2026 తర్వాత నేను బస్తర్‌కు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడే కేంద్ర ప్రాంతీయ మండలి 26వ సమావేశం జరిగింది. బస్తర్ ప్రజల మధ్య ఎక్కడ చూసినా ఉత్సాహం, భవిష్యత్తు పట్ల నమ్మకం నిండిన వాతావరణం కనిపిస్తోంది. బస్తర్ నక్సల్ రహిత ప్రాంతంగా మారడం మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. మా నక్సల్ రహిత ఉద్యమానికి బీజేపీయేతర ప్రభుత్వాలు చాలానే మద్దతు ఇచ్చాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ నక్సల్ రహిత ఉద్యమంలో మాకు మద్దతు ఇవ్వలేదు. డిసెంబర్ 13, 2023న ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, బస్తర్‌లో మిగిలి ఉన్న నక్సలైట్లను మేము లక్ష్యంగా చేసుకున్నాము. భద్రతా దళాల శౌర్యం, ధైర్యం, త్యాగాల ఫలితంగా, మార్చి 31, 2026 అనే నిర్ణీత గడువు తేదీకి ముందే దేశం నుండి నక్సలిజం పూర్తిగా నిర్మూలించబడింది." అని అమిత్ షా పేర్కొన్నారు.