17 July, 2026 | 2:25 AM

బోధన్ మార్కెట్ వద్ద రోడ్డుపై ఆక్రమణల తొలగింపు

17-07-2026 02:14 AM

బోధన్, జూలై 16 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ పరిసరాల్లో రోడ్డుపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు, బోధన్ టౌన్ ఎస్హెచ్‌ఓ వెంకట్ నారాయణ పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రహదారిపై ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలతో పాటు ఇతర అక్రమ ఆక్రమణలను తొలగించారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రహదారిని పూర్తిగా ఖాళీ చేయించారు. భవిష్యత్తులో రోడ్డుపై మళ్లీ ఆక్రమణలు చేపట్టితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.