5 March, 2026 | 5:18 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

టీజీఈ హైట్స్‌లో ఉద్యోగుల సమావేశం

23-02-2026 01:50 AM

ఖమ్మం పోలేపల్లిలో టీజీవో హౌస్ బిల్లింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహణ

ఖమ్మం, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): ఖమ్మం పోలేపల్లిలోని టీజీఈ హైట్స్‌లో టీజీవో హౌస్ బిల్లింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఏలూరి శ్రీనివాసరావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షులు, టిజిఈజేఏసీ సెక్రెటరీ జనరల్ హాజరయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. టీజీ ఈ హైట్స్ వర్క్ పురోగతిని సమీక్షించారు. పనులు వేగవంతంగా పూర్తిఅవుతున్నాయని మార్చి 15వ తారీకు వరకు నాలుగు టవర్స్‌లోని సెల్లార్‌లో పార్కింగ్ పనులు పూర్తి అవుతాయని చెప్పారు. ఇప్పటివరకు ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి బ్యాంకు లోన్ ఇవ్వడానికి అవసరమైన డాక్యుమెంటేషన్ ప్రొసీజర్‌ను పూర్తి చేస్తున్నామని తెలిపారు. సహకరించడానికి వచ్చిన ఎస్‌బీఐ మేనేజర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఉమ్మడి ఖ మ్మం జిల్లా ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉద్యోగుల గేటెడ్ కమ్యూని టీలో భాగస్వామ్యం కావాలని కోరారు. మా ర్చ్ 15న జరిగే ఉద్యోగ సమ్మేళనాన్ని హౌస్ బిల్లింగ్ సొసైటీ సభ్యులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సకల ఉద్యోగులు  పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొందిన ఏలూరీ శ్రీనివాసరావును ఉద్యోగ సంఘ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్ష కార్యదర్శులు  వెంక టేశ్వరరావు, మోదుగు వేలాద్రి, టీఎన్జీవో అధ్యక్షు లు గుంటుపల్లి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.