calender_icon.png 23 February, 2026 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్షవాత బాధితులకు కొత్త జీవం

23-02-2026 01:51:56 AM

శస్త్రచికిత్స లేకుండానే సాంకేతికత అందుబాటులోకి

మాగ్నెటిక్ థెరపీతో మెరుగైన ఫలితాలు

కిమ్స్ న్యూరో రిహాబిలిటేషన్‌లో ముందడుగు

హైదరాబాద్, ఫిబ్రవరి 22: పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) వచ్చిన బాధితులకు అధునిక సాంకేతికతతో శస్త్రచికిత్స లేకుండానే సాంత్వన చేకూరుస్తున్నాయి. ఆదివారం కిమ్స్ హాస్పిటల్స్ న్యూరోసైన్సెస్, రిహాబిలిటేషన్ విభాగాలు, ఏరోబ్ ప్రైవేట్ లిమిటెడ్, డెన్మార్కుకు చెందిన మాగ్వెంచర్ సంస్థల సహకారంతో నాన్-ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేష్ప, ముఖ్యంగా రిపిటేటివ్ ట్రాన్స్క్రానియ ల్ మాగ్నెటిక్ స్టిమ్యులేషన్‌పై హ్యాండ్స్-ఆన్ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ నిర్వహించాయి.

దేశవ్యాప్తంగా దాదాపు 100 మంది న్యూరాల జిస్టులు, పెయిన్ స్పెషలిస్టులు, న్యూరో-రిహా బిలిటేషన్ నిపుణులు పాల్గొని, స్ట్రోక్ రికవరీ, దీర్ఘకాలిక నొప్పి నిర్వహణలో ఆర్‌టీఎంఎస్ వినియోగంపై తాజాగా వచ్చిన మార్పులపై  చర్చించారు. ఆర్‌టీఎంఎస్ అనేది శస్త్రచికిత్స అవసరం లేకుండా, ఎంఆర్‌ఐ స్కాన్లలో ఉపయోగించే మాగ్నెటిక్ ఫీల్డ్ తరహాలోనే మెదడులో పనిచేయని ప్రాంతాలను ఉత్తేజపరుస్తుందన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సెంటర్ ఫర్ రిహాబిలిటేషన్ డైరెక్టర్ డా.సుధీంద్ర వూటూరికి సర్టిఫికేట్ ప్రదానం చేసింది. కార్యక్రమంలో డెన్మార్కుకు చెందిన మాగ్వెంచర్ మెడికల్ అప్లికేషన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ మాథీసెన్, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా.భాస్కర రావు పాల్గొని మాట్లాడారు.