calender_icon.png 19 January, 2026 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పనులు షురూ

19-01-2026 05:06:50 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలంలోని బంబార గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ బెండరే క్రిష్ణజీ, ఉపసర్పంచ్ జాడి సంతోష్‌తో కలిసి నూతన పనులను ప్రారంభించారు. గ్రామంలోని పేద కుటుంబాలకు చేతినిండా పని కల్పించడంతో పాటు, గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు.​ ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామీ ణ ప్రాంతాల ఆర్థిక బలోపేతా నికి ఉపాధి హామీ పథకం ఎంతో దోహదపడుతుంద న్నారు.

ప్రతి కుటుంబానికి పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని, వీటి ద్వారా గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుప డతాయని పేర్కొన్నారు. అనంతరం ఉపసర్పంచ్ మాట్లాడుతూ.. కూలీలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పనుల నిర్వహణలో పారదర్శకత పాటిస్తూ, కూలీలకు సకాలం లో వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటా మని భరోసా ఇచ్చారు.​ ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రామకృష్ణ చారి, మేటీలు రాజశేఖర్, సునీల్ మరియు కూలీలు పాల్గొన్నారు.