సర్పంచ్ సహా పలువురు కాంగ్రెస్ లో చేరిక
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ గ్రామ సర్పంచ్ చిలుకూరి కళ్యాణి–సతీష్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మిట్ట పద్మ, సత్యనారాయణ, మానస, శ్రవంతి ,నాయకులు సాయి వంశీ, సతయ్య, రమేష్, రాజేందర్, సురేష్, వెంకటేష్, సంతోష్ తదితరులు పార్టీలో చేరారు. ఆసిఫాబాద్‌లోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇంచార్జి అజ్మీర శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఇరుకుల మంగ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజల పక్షాన చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




