16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

31-05-2025 03:09 PM

బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి

మంచిర్యాల,(విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని బీజేపీ నాయకులు, రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ చైర్మన్ రఘునాథ్ వెరబెల్లి(Raghunath Verabelli Foundation Chairman Raghunath Verabelli) అన్నారు. శనివారం మంచిర్యాలలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జాబ్ మేళాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఎం ఎస్ ఎన్ ఫార్మా, ఐటీసీ, న్యూల్యాండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించిన మేళాకు 200 మందికి పైగా డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుకున్న యువతీ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, జోగుల శ్రీదేవి, అమిరిశెట్టి రాజ్ కుమార్, బోయిని హరి కృష్ణ, బింగి సత్యనారాయణ, మెరెడికొండ శ్రీనివాస్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.