16 April, 2026 | 11:51 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పొగాకు వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి

31-05-2025 03:14 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి), పొగాకు వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సూచనల(Telangana State Legal Services Authority Instructions) మేరకు  జిల్లా న్యాయసేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం (World No Tobacco Day) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  సందర్బంగా కామారెడ్డి జిల్లా కేంద్ర గ్రంధాలయం సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా గ్రంధాలయ సమస్త చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి హాజరయి  పొగాకు యొక్క దుష్ప్రభావాలు వాటి వల్ల  కలిగె నష్టాలు గూర్చి అవహగాన కల్పించారు. అనంతరం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది  మాయ సురేష్, లైబ్రరీ చదువుతున్న ఉద్యోగార్థులతో  పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నంద రమేష్  ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో న్యాయవాది వేణు ప్రసాద్  ,అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది ఎం శ్రీనివాస్ రావు ,జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి , జిల్లా న్యాయసేవాధికార సంస్థ, జిల్లా కేంద్ర గ్రంధాలయ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.