16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు

26-03-2025 06:20 PM

రాజీవ్ వికాస్ పథకంపై సమీక్షలో తాసిల్దార్ నాగరాజు..

కాటారం (విజయక్రాంతి): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికసాయం అందించడానికి ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు స్వీకరించాలని కాటారం తాసిల్దార్ నాగరాజు తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అడ్డురి బాపు, ఎంపిఓ వీరస్వామి, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు యువతి, యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కింద సొంత వ్యాపారాల స్థాపనకు ప్రభుత్వం రాయితీ అందించనుందని తెలిపారు.

నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించి వ్యాపారాల్లో రాణించేందుకు రాయితీని పొందవచ్చని తెలిపారు. రాజీవ్ యువ వికాస పథకంలో సుమారు 75 రకాల యూనిట్ల ఏర్పాట్లుకు పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా డిఆర్డీవో ఉంటారని తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన యువతి యువకులు వెబ్సైట్ అధికారిక https://tgobmms.gg.gov.in ఆన్లైన్ దరఖాస్తు చేయాలని, ప్రింట్ తీసిన దరఖాస్తును ఎంపిడిఓకు అందచేయాలని తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారై, పరిమిత ఆదాయ వనరుల గల బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ యువత రేషన్, పాన్ కార్డు ఫోన్ నెంబర్, ఫొటో, ఆధార్ కార్డ్, కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలను దరఖాస్తులో నమోదు చేయాలన్నారు. దరఖాస్తులు స్వీకరణకు ఆఖరు తేదీ 05.04.2025 వరకు ఉందని అన్నారు.