15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించాలి!

17-02-2026 12:00 AM

అదివాసీ యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆ వర్గం మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో నాణ్యమైన విద్య అందకపోవడం, మధ్యలోనే చదువు ఆపేయడం వారి భవిష్యత్తును దెబ్బతీస్తోంది. నిరుద్యోగం, సరైన ఉపాధి మార్గాలు లేకపోవడం వల్ల యువత అసహనానికి గురై పెడదోవ పడుతున్నారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలకు త్వరగా బానిసవ్వడం వల్ల ఆరోగ్యం, సామాజిక గౌరవం కోల్పోతున్నారు.

ఆధునిక పోకడల ప్రభావంతో తమ మూలాలను, విలువలను మరిచిపోవడం వల్ల వ్యక్తిత్వ లోపాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదివాసీ యువతకు వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించాలి. చైతన్య కార్యక్రమాలు, మత్తు పదార్థాలతో కలిగే అనర్థాలపై అవగాహన కలిగించాలి.

యువతలో ఉన్న ప్రతిభను గుర్తించి క్రీడలు, కళల వైపు వారిని ప్రోత్సహించాలి. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వ పథకాలతో పాటు, చదువుకున్న ఆదివాసీ యువకులు తమ దృక్పథం మార్చుకునేందుకు ముందుకు రావాలి. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీని, విక్రయాలను అరికట్టడానికి పోలీసులు, ఎక్సైజ్ శాఖ కఠినంగా వ్యవహరించాలి. 

 వూకే రామకృష్ణ, ఆదిలాబాద్