calender_icon.png 20 February, 2026 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనవిజయంతో ముగింపు

20-02-2026 01:02:56 AM

  1. కెనడాను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్థాన్ 

మహ్మద్ నబి స్పిన్ మ్యాజిక్

పల్లెకెలె, ఫిబ్రవరి 19  : టీ20 ప్రపంచకప్‌ను ఆప్ఘనిస్థాన్ ఘనవిజయంతో ముగిం చింది.  నామమాత్రంగా జరిగిన చివరి మ్యా చ్‌లో ఆ జట్టు కెనడాను చిత్తు చేసింది.  ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది.  ఓపెనర్ ఇబ్ర హీం జద్రాన్ 56 బంతుల్లో 95 పరుగులుతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి 5 పరుగుల దూరంలో ఔటయ్యాడు. సెదిఖుల్లా అటల్ (44), రహ్మానుల్లా గుర్బాజ్ (30) స్కోర్లతో పర్వాలేదనిపించారు. 

కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ 3 వికెట్లు తీయగా.. దిల న్ హేలిగర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తర్వాత భారీ లక్ష్యఛేదనలో కెనడా ఆరంభం నుంచే తడబడింది. కేవలం 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. హర్ష టకర్(30) , జఫర్ (28) మాత్రమే పర్వాలేదనిపించగా.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. మహ్మద్ నబీ స్పిన్ మ్యాజిక్ కు ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు. చివరికి కెనడా 118 పరుగులకే పరిమితమైంది.

నబీ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 4 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇది లా ఉంటే ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్లు ఖరారైపోయా యి. ఆఫ్ఘన్, కెనడా జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, కివీస్ సూపర్-8కు చేరాయి.