సమాజాన్ని ప్రభావితం చేసే ఆపరేషన్ అరుణారెడ్డి
పోసాని కృష్ణమురళి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. ఇందులో ఇందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్‌రావు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 17న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. “నా అన్ని చిత్రాల్లో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’కి బెస్ట్ స్క్రీన్‌ప్లే ఇచ్చానని చెప్పగలను.
ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నా” అన్నారు. హీరోయిన్ ఇందోళ చక్రవర్తి మాట్లాడుతూ.. “ఆపరేషన్ అరుణారెడ్డి’ నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది, సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉంటుంది” అని తెలిపారు. మరో కథానాయకి కాజల్ శర్మ మాట్లాడుతూ.. “రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ మా మూవీ గురించే మాట్లాడుకుంటారు” అని చెప్పారు.
‘ఇదొక మంచి మూవీ. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాన’ని నిర్మాత శ్రీనివాస్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు మహదేవ్ ఏలేందర్, డీవోపీ సుధాకర్ తదితర చిత్రబృందం కూడా మాట్లాడారు.






