విశ్వేశ్వరయ్య సేవలు ఇంజనీర్లకు స్ఫూర్తిదాయకం

15-09-2026 | 10:16pm

చీఫ్ ఇంజనీర్ ప్రకాష్‌

కేటీపీపీలో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు

గణపురం,(విజయక్రాంతి): విశ్వేశ్వరయ్య సేవలు ఇంజనీర్లకు స్ఫూర్తిదాయకమని చీఫ్ ఇంజనీర్ ప్రకాష్‌(Chief Engineer Prakash) అన్నారు. భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి విశేష సేవలందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య(Sir Mokshagundam Visvesvaraya) 165వ జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను(Engineers day celebrations) టీజీపీఈఏ, టీఎస్‌ఈఏఈఏ కేటీపీపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీపీపీ చీఫ్ ఇంజనీర్ ప్రకాష్ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూపరింటెండింగ్ ఇంజనీర్లు మురళీమోహన్, వెంకటేశ్వరరావు, రామ్ ముత్యాలరావు పుష్పాంజలి ఘటించారు. ఇంజనీర్స్ డే సందర్భంగా టీజీపీఈఏ, టీఎస్‌ఈఏఈఏ కేటీపీపీ శాఖ ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ ప్రకాష్‌తో పాటు సూపరింటెండింగ్ ఇంజనీర్లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య కృషి, అంకితభావం, క్రమశిక్షణ, దేశ అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధత నేటి ఇంజనీర్లకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఇంజనీరింగ్ రంగ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారుఈ కార్యక్రమంలో టీజీపీఈఏ నాయకులు మార్కుల, సంతోష్, తిరుపతి, రాజ్‌కుమార్, నరేష్, నర్సయ్య, రాజు, రత్నాకర్, వంశీ, శకుంతలతో పాటు టీఎస్‌ఈఏఈఏ నాయకులు వీరేష్, రంజిత్, రత్న కిరణ్, రాజేష్, సాకేత్, శ్రావంతి, శ్రీను, సంతోషి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు