1 August, 2026 | 4:23 PM

Breaking News

రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •   ఉదయం 11 గంటల నుండి నిలకడగా ప్రవహిస్తున్న గోదావరి వరద   •  

కామెడీని ఎంజాయ్ చేస్తారు

08-11-2024 12:00 AM

చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ధూం ధాం’. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు సాయికిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీమోహన్ కథ అందిస్తూ స్క్రీన్ ప్లే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో చేతన్‌కృష్ణ మాట్లాడుతూ - “ధూం ధాం’ సినిమాలో కష్టాలు, కన్నీళ్లు ఉండవు. ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. నేను ఇంతకుముందు చిత్రాల్లో కమర్షియల్ లుక్‌లో కనిపించలేదు. ఇందులో అలా కనిపించేందుకు ప్రయత్నించా. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ కోసం స్టార్స్‌కు పనిచేసిన స్టైలిస్టులు వర్క్ చేశారు” అన్నారు. దర్శకుడు సాయికిషోర్ మచ్చా మాట్లాడుతూ..

‘సెకండాఫ్‌లోని కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు. “నాకు సినిమాలంటే ఇష్టం, గౌరవం. మా చేతన్ చదువు పూర్తయ్యాక సినిమాల్లో చేస్తానని చెప్పాడు. అలా తనను హీరోగా పెట్టి మూవీస్ చేశాం. ఈ జర్నీలో ‘ధూంధాం’ చాలా ప్రత్యేకంగా నిర్మించాం” అని నిర్మాత రామ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్ర కథా రచయిత గోపీమోహన్ మాట్లాడుతూ..

ఈ సినిమాలో ముఖ్యంగా నేను సెకండాఫ్ మీద డిపెండ్ అయ్యా. ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న స్పందన వల్లే మంచి మంచి స్క్రిప్టులు చేయగలుగుతున్నా’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాటల రచయిత ప్రవీణ్‌వర్మ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటుడు సాయిశ్రీనివాస్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.