12 March, 2026 | 11:37 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

సునీల్ శెట్టికి గాయాలు

08-11-2024 12:00 AM

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం ‘హంటర్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఓ యాక్షన్ సన్నివేశం చేస్తుండగా ఆయన గాయపడినట్టు సన్నిహితులు వెల్లడించారు. ఆయ న పక్కటెముకలకు ఒక చెక్క లాగ్ అనుకోకుండా తగలడం తో గాయపడ్డారని, షూటింగ్ ఆగిపోయిందట. వెంటనే సునీల్ శెట్టిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని సునీల్ శెట్టి సైతం ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘చిన్న గాయమే. ప్రస్తుతం బాగానే ఉన్నా. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. ముంబయిలోని అండర్ వరల్డ్ నేపథ్యంలో హంటర్ వెబ్ సిరీస్ రూపొందుతోంది. దీనిలో సునీల్ శెట్టి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ‘వెల్ కమ్ టు ది జంగిల్’ చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు.