30 June, 2026 | 9:18 PM

Breaking News

మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి

30-06-2026 08:43 PM

- కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తాం

గుండాల,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను బోధిస్తున్నాయని మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రమేష్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఆధునికమైన మౌలిక వసతులతో కూడిన క్లాస్ రూములు, డిజిటల్ క్లాస్ రూమ్, గణితం, సాంఘిక శాస్త్రం, సైన్స్ కు సంబంధించిన పరికరాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ప్లే గ్రౌండ్, బాత్రూం, లెట్ రూమ్స్ కలవని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం, స్వచ్ఛమైన తాగునీరు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు ఉన్నారని, చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులుతో పాటు ఉపాధ్యాయులు శరత్ బాబు, ఉపాధ్యాయురాల్లు రాజ్యలక్ష్మి, వెన్నెల, ప్రమీల, శకుంతల లు విజ్ఞప్తి చేశారు.