17 April, 2026 | 4:24 PM

శిల్పారామంలో అలరించిన నృత్య ప్రదర్శన

19-05-2025 12:00 AM

శేరిలింగంపల్లి, మే 18: మాదాపూర్ లోని శిల్పారామంలో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నాడు నృత్య కిన్నెర మద్దాలి ఉష గాయత్రీ శిష్య బృందం ‘మాతృదేవో భవ‘ అనే కూచిపూడి నృత్య రూపకం  ప్రదర్శించారు.

భమిడి పల్లి నరసింహ మూర్తి సత్య యుగం, కృత యుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం,కలియుగంలో  మాతృమూర్తుల పార్వతి దేవి, లీలావతి, సీత మాత, యశోద మాత,వకుళ దేవి మాతృ ప్రేమని,కూచిపూడి నృత్యరీతిలో ప్రదర్శించారు.

ఈ నృత్యాలను సీమాతి వాసవి చౌదరి, రమ్య వేణి, లక్ష్మి శ్రీ, నీరజ, ఆశ్రిత షిండే,యశస్వినీ,తన్మయి, సహస్ర,లక్ష్మి వాత్సల్య, రసజ్ఞ, లాస్య ప్రియా,సుభి,చేరిష్య, ఇరా,దీక్షిత మొదలైన కళాకారులు ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు.