calender_icon.png 19 May, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రారంభమైన నాయిని విశాల్ ట్రస్ట్ క్రికెట్ టోర్నమెంట్

18-05-2025 10:58:11 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టేడియం(Hanumakonda Arts and Science College Stadium)లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుమారుడు స్వర్గీయ నాయిని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజున నాయిని విశాల్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  నాయిని టి -10 లీగ్ సెషన్ - 2  క్రికెట్ పోటీలను  ప్రభుత్వ విప్ డా.రామచంద్ర నాయక్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కే ఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలసి ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నాయిని రాజేందర్ రెడ్డి కుమారుడు 2015 లో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం తో వారి జ్ఞాపకాలను తన మనసులో ఉంచుకుని, ప్రజలు కూడా విశాల్ అంటే ఎవరో వారి పేరుమీద ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూవారి ఆత్మకు శాంతి చేకూరేలా చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువతకు ప్రోత్సాహాన్ని ఇస్తూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా విశ్వవిద్యాలయం స్థాపించిన అన్ని క్రీడలను అభ్యసించేలా చూస్తున్నారని, గతపాలకుల పాలనలో కుంటుపడిన గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. దేశంలోనీ గొప్ప క్రీడలన్నింటినీ కూడా, ప్రతి వారం, నెలలో ఏదో ఒక క్రీడా జరిగేలా చూస్తున్నామని అన్నారు.

క్రికెట్ తో పాటుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు కబడ్డీ, వాలి బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ లాంటి అథ్లెటిక్ క్రీడాలను ఏర్పాటు చేసుకుని క్షేత్ర స్థాయిలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు భవిష్యత్ క్రీడలను మరింత అభివృద్ధి చేసేలా ఈ ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి దూరదృష్టిలో ఇటీవలే ప్రపంచ సుందరీమణులు పోటీలను ఏ విధంగానైతే ఘనంగా నిర్వహించుకున్నామో 2030 నాటికి ఒలింపిక్ లను కూడా తెలంగాణలో నిర్వహించుకునేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.నాయిని విశాల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు నాయిని విశాల్  చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, క్రీడాకారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.