calender_icon.png 19 May, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ వైద్యులపై కేసులు నమోదు

18-05-2025 11:03:04 PM

14 హాస్పిటల్ పై దాడులు

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో కాంపౌండర్లుగా పని చేసి, నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ ఎం సి), టీ ఎస్ ఎం పి ఆర్  చట్ట నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్ల వేషధారణలో ప్రజలను మోసం చేస్తూ మానవ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్న అక్రమ వైద్యులపై ఆదివారం  తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సంబదిత పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేశారు. శ్రీనివాస శ్రీ లక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, యాదయ్య,సౌమ్య సుజని పాలీ క్లినిక్, పాలకురి వెంకటేశ్వర్లు, యశ్వంత్ క్లినిక్, ముషంపల్లి రోడ్, కృష్ణా రెడ్డి, నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బాలాజీ క్లినిక్, శ్రీనగర్ కాలనీ, వి. శ్రీనివాస్, దేవి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ & ఫ్యాన్సీ స్టోర్, ఏనీనగర్  జి. రామకృష్ణ, ఉపేంద్ర ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ & డయాగ్నొస్టిక్ సెంటర్, ఎన్.జీ. కాలేజీ సమీపంలో ఉపేంద్ర, హెల్త్ కేర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ & ల్యాబ్, ఎస్.ఆర్. గార్డెన్, రిజ్వాన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నగెల్ల అంజయ్య క్లినిక్, నల్గొండ మెయిన్ రోడ్, నగెల్ల అంజయ్య, లక్ష్మి శివాని హాస్పిటల్, హెచ్‌పి పెట్రోల్ బంక్ ఎదురుగా, నలపరాజు వెంకన్న మునుగోడు పోలీస్ స్టేషన్ లో,జోయ్ క్లినిక్, తిప్పర్తి, ఎస్. రత్నం మోక్షిత క్లినిక్, తిప్పర్తి  నూకల నాగేశ్, ప్రణీత్ క్లినిక్, తిప్పర్తి  వెల్లంపల్లి రమేష్, శంకర్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, కజిరామారం, ఎం. శంకర్, ఎక్సలెంట్ ఐ కేర్ & ఫస్ట్ ఎయిడ్ సెంటర్, తిప్పర్తి,  షేక్ ఖలీం, తిపర్తి  పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు. వీరు  కాంపౌండర్లు  ఆర్ఎంపి, పిఎంపి అని పేర్కొంటూ  ఇష్టరీతినా ఆంటిబయోటిక్,  స్టేరోయిడ్స్, నొప్పినివారణ  ఇంజెక్షన్స్ వారివద్దకు వచ్చే రోగులకు ఇస్తూ  ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నట్టుగా  అధికారులు గుర్తించారు.