6 May, 2026 | 10:52 AM

గరీబ్ పేట పంచాయతీ అంతా దుర్గంధం

06-05-2026 10:22 AM

పట్టించుకోని ప్రభుత్వ అధికారులు..

రోడ్లు వేశారు డ్రైన్లు మరిచారు..

కొత్తగూడెం,విజయక్రాంతి: భద్రాద్రి జిల్లాలోని సుజాతనగర్ మండలంలో గల గరీపేట పంచాయితీ పరిస్థితి మరి అద్వానంగా తయారైంది.  గెలిచిన నాయకులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ,కేవలం ఎలక్షన్స్ వస్తే తప్ప గరీబుపేట పంచాయతీలోని ఓటర్లు ప్రజలు వారికి కానరారు.  పంచాయతీలో విద్యావంతులు తక్కువగా ఉండటం ఒక కారణమా, లేదా కుల రాజకీయాలు తో అందరినీ మభ్యపెట్టి రాజకీయ నాయకులు వారి పని హాయిగా చేసుకుని గెలిచాక ముఖం చాటేసారా అని పంచాయతీ ప్రజలు అనుకుంటున్నారు. హడావుడిగా రోడ్లు వేశారూ ఎలక్షన్స్ కి ముందుగా, కానీ పూర్తిగా డ్రైనేజ్ చేయిస్తాను అద్వాన్న స్థితిలోకి నెట్టివేశారు. గత ప్రభుత్వ అధికారులు ఇంకుడు గుంతలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు ,కానీ ఇంకుడు గుంతలు లేకపోగా మురుగునీరు రోడ్డుపైకి వదలడం అత్యంత దారుణామని బాటసారులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. మురుగునీటితో దుర్గంధం వెదగల్తుంది ఆ ప్రాంతమంతా.గరీపేట పంచాయతీ ప్రజలు ఆరోగ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి .నిజానికి ఈ పంచాయతీ లోనే ఎక్కువ మంది ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నటువంటి పంచాయతీ. ఇలాంటి తరుణంలో వారు దండిగా డబ్బు సంపాదన ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం గాలికి వదిలేసారు. ఆర్ఎంపీలు సైతం ఆ పంచాయతీ వార్డు మెంబర్లుగా ఉండటం గమనార్హం .ప్రజల పట్ల వారు చూపే దయాద్ర హృదయం కరువైందా? ఎవరైతే నేమి డబ్బు సంపాదించుకుంటే చాలు అనే ధోరణిలో, అటు ప్రభుత్వ అధికారులు,ఇటు రాజకీయ నాయకులు ప్రజా శ్రేయస్సు మరిచారా అని అనుకుంటున్నారు ఓటర్లు.ఇది ఎంతవరకు సమంజసం అనే ప్రజలు పత్రికా  వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు, అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ రాజకీయ బలాబలాలు చాలా బలంగా ఉంటాయి. ప్రతిపక్షాల పోరు కూడా నువ్వా నేనా అన్న చందానా సాగుతూ ఉంటుంది. ఇక్కడ రాజకీయం కన్నా పరువు కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు . ఎవరు గెలిచినా ఈ పంచాయతీకి మొండి చేయి చూపించడం సరైనది కాదు అని వాపోతున్నారు స్థానికులు. మొత్తంగా రెండు వేల పైచిలుకు ఓటర్లు ఉన్నటువంటి ఈ పంచాయతీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక పలువురు ఆసుపత్రుల పాలు అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎండకాలం దోమలు విపరీతంగా సంచరించే సమయం ,దీనిపై పంచాయతీ అధికారులను అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు ప్రశ్నిస్తే ,ఎండాకాలమే కదా బ్లీచింగ్ పౌడర్ అవసరమా వర్షాకాలమైతే వేస్తాం అని దురుసుగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు అని వాపోతున్నారు స్థానిక వార్డు మెంబర్లు. పంచాయతీ అధికారుల సమక్షంలో వార్డు మెంబర్ల సమావేశం లో ,చర్చ రక్షగా మారిందని  ఒక బోగట్ట, ఏదేమైనా ఈ పంచాయతీకి మహర్దశ కలిగించే వ్యక్తులు స్వార్థపూరితంగా ఉండటం వల్ల, నేడు గరీబిపేట పరిస్థితి అద్వాన్న దుస్థితిలో ఉంది. రామవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పంచాయతీలో ,ఎంపీటీసీలు గా,సర్పంచులుగా పదోన్నతులు పొందిన వ్యక్తులు, బడ రాజకీయ నేతలకు కుడి భుజాలుగా ఉద్ధండులుగా ఉన్న నాయకులు ఉన్నారు .మరి వారందరూ ఏమైపోయారు. గరీపేట పంచాయతీ ఇలా దుర్భర పరీస్థితిలో ఉండడానికిలా కారకులెవరు, పంచాయతీ అధికారులు సెక్రటరీలు వీరంతా ప్రజలకు మురుగునీటిపై ప్రజా ఆరోగ్య సమస్యలపై అవగాహన సదస్సులు ఏర్పరిచి ప్రజలను ఉత్తేజపరిచి చైతన్యవంతులుగా చేయడం గిరి బాధ్యత. ప్రజలకు వీటిపై అవగాహన లేక డ్రైనేజీ వాటర్ ని మురుగునీటిని రోడ్లపైకి వదిలేస్తున్నారూ, ప్రభుత్వం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. 

ప్రజలకు సరైన అవగాహన కల్పించలేక ,ఈ ప్రభుత్వాలు , నాయకులు,అధికారులు విఫలమయ్యారూ. పంచాయితీ ప్రజలకు విడిపోయి అవగాహన కల్పించి వారి ఆరోగ్యం పట్ల సరైన సూచనలు సలహాలు ఇచ్చి పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని విద్యార్థి సంఘాలు నాయకులు పాఠకులు, సూచనల మేర పాటించినట్లయితే అందరూ ఆరోగ్యంతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తారు. కేవలం ఎలక్షన్స్ సమయంలో మాత్రమే కనబడే రాజకీయ నాయకులు తర్వాత ఆ ఊరిని వెలివాడలా అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఎంతటి దుర్మార్గమైన చర్య అని గరీబ్ పేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా పంచాయతీ అధికారులు చొరవ చూపి,మురుగు నీరును పారద్రోలే పనిలో నిమగ్నమై ఉంటే, మంచి ఫలితాలు వస్తాయని భవిష్యత్తులో మంచి ప్రణాళికలతో ముందుకు వెళితే గరీంపేట గ్రామం అభివృద్ధి సాధ్యమైనంత త్వరగా అద్భుతమైన పంచాయతీగా రూపుదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది.ఇటువంటి కాకుండా ఉంటాయని అద్భుత జరుగుతాయని లేనిచో ,ఇట్టి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, రాజకీయంగా, ప్రభుత్వ పరంగా చర్యలు చేపట్టే విధంగా ఉద్యమాన్ని చేపడతామని అంటున్నారు గ్రామపంచాయతీ గరీబ్ పేట ప్రజలు .వేచి చూద్దాం ఎలాంటి మార్పు రాబోతుందో ప్రత్యేక నిఘానేత్రంతో విజయకాంతి ఎప్పుడు ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి , ప్రజలకు న్యాయం జరిగే వరకూ ప్రజాపక్షంగా, ప్రజా గొంతుకగా విజయక్రాంతి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.

విలేజ్ సెక్రటరీ రోహిణి నీ చరవనిలో మా ప్రతినిధి వివరణ అడగగా, పలు ఆసక్తికరమైన అంశాలు తెలియజేశారు .

మురుగునీటిపై బ్లీచింగ్ పౌడర్ని పిచికారి చేయడానికి, ఇది వేసవికాలం కాబట్టి కాస్త వర్షాలు పడితేనే ,వాటిపై పిచ్చికారి చేస్తామని బదులు ఇవ్వటం జరిగింది. ప్రతి నెల పంచాయతీ కార్యాలయంలో వార్డ్ మెంబర్ల సమక్షంలో, సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై తీర్మానాలు,  ఎజెండాలను చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని , చాలామంది పంచాయతీ ప్రజలు వారి వారి లైన్ లలో డ్రైనేజీలకు స్థలం ఇవ్వకపోవడం ఒక సమస్యగా మారిందని వారు స్థలం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డ్రైనేజీలో నిర్మించడానికి నేను సిద్ధంగా ఉన్నామని, డ్రైన్లు లేనిచోట సింగరేణి షేప్ నిధుల ద్వారా గాని పంచాయతీకి సంబంధించినటువంటి బడ్జెట్ ద్వారా పనులు పూర్తి చేస్తామని తెలియజేశారు.