16 August, 2026 | 10:23 AM

సీఎం కు ఘన స్వాగతం

16-08-2026 09:27 AM

హెలిప్యాడ్ వద్ద మంత్రులతో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికిన నీలం

సంగారెడ్డి వేదికగా స్మార్ట్ రేషన్ కార్డు, మహనీయుల విగ్రహావిష్కరణ 

చిట్కుల్, రుద్రారం లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత

పటాన్ చెరు: సంగారెడ్డి పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర సిఎం  రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు. కంది ఐ ఐ టి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కి నీలం మధు పుష్పగుచ్ఛం అందించి, సాదరంగా ఆహ్వానించారు. మంత్రులు, ముఖ్య  కాంగ్రెస్ నేతలతో  కలిసి వచ్చిన నీలం మధు ముదిరాజ్ సీఎం కి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి సంగారెడ్డి ఐ బీ గెస్ట్ హౌస్ వద్ద జగ్గారెడ్డి, నిర్మలా జగ్గా రెడ్డి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జవహర్ లాల్ నెహ్రు, రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులతో కలిసి పాల్గొన్నారు.

అనంతరం అక్కడి నుంచి అంబేద్కర్ స్టేడియంలో సభ  ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ,వివేక్ వెంకటస్వామి, ప్రజాప్రతినిధులతో కలిసి నీలం మధు పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, నియోజకవర్గాల అభివృద్ధి పనులపై చర్చించారు. గత పదేండ్లలో అప్పటి కె సి ఆర్ ప్రభుత్వం పేద ప్రజలను విస్మరిస్తే  సీ ఎం  రేవంత్ రెడ్డి లక్షలాది మంది పేద కుటుంబాలకు  నూతన రేషన్ కార్డులను అందించిన విషయం గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు నియోజకవర్గం నుండి చిట్కుల్ కి చెందిన సంగన్నగారి సంతోష, రుద్రారంకి చెందిన కృష్ణవేణి కి సీఎం చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన దిశానిర్దేశం సభలో విశేష ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమాలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు, చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.