పేకాటలో ఖమ్మం మంత్రి అనుచరుల అరెస్ట్
పెద్దమనుషుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు?
మణుగూరు/పినపాక, ఆగష్టు 15 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పినపాక మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులను పేకాట ఆడుతుండగా ఆంధ్రా పోలీసులు పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన ప్రముఖ మంత్రి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అనుచరులుగా చలామణి అవుతున్న పినపాక మండలానికి చెందిన ఏడూళ్లబయ్యారం, సీతంపేట, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి, ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు పేకాట ఆడుతుండగా ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ లో ప్రత్యేక పోలీసు బృందాలకు దొరికినట్లు సమాచారం.
పెద్దమనుషుల ముసుగులో చలామణి అవుతూ, వారి ఇష్ట రాజ్యాంగ ప్రవర్తించడమే కాకుండా, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పేర్లను సైతం బధనం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పేకాట ఆడిన పోలీసులు పట్టుకుంటున్నారని, దీంతో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ వెళ్లి పేకాట ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు అరెస్టు చేయడంతో పాటు కూనవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసినట్లు విశ్వసనీయ సమాచారం.






