16 August, 2026 | 9:56 AM

ఉత్తమ సేవలకు గుర్తింపు.. భూపాల్ సంతోష్ కుమార్‌కు ప్రశంసాపత్రం

16-08-2026 09:23 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించారు. బీబీపేట మండలం యాడారం క్లస్టర్ వ్యవసాయ శాఖ ఏఈఓ భూపాల్ సంతోష్ కుమార్‌కు ఉత్తమ సేవా ప్రశంసాపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి సలహాదారు వి. హనుమంతరావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. రైతులకు వ్యవసాయ సలహాలు అందించడం, ప్రభుత్వ పథకాలను చేరువ చేయడం, శాఖ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు ఈ గుర్తింపు లభించింది.