మహనీయుల త్యాగస్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్దాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పరదేశ పాలన నుంచి విముక్తి చేసి స్వేచ్ఛాయుత వాతావరణ సాధనను చేసేందుకు జరిపిన స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానీయులు తమ ప్రాణాలను తృణప్రాయం చేశారు. వారి త్యాగాల స్ఫూర్తిని ఆశయంగా చేసుకొని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ప్రగతి మైదానంలో 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మొదట జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరధి అభివర్ణించిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత నిస్తూ ముందుకు సాగుతోంది. రైతు సంక్షేమం నుంచి యువత ఉపాధి వరకు, మహిళా సాధికారత నుంచి పేదల సంక్షేమం వరకు, విద్య నుంచి వైద్యం వరకు, సాగు నీటి నుంచి పారిశ్రామిక అభివృద్ధి వరకు ప్రతి రంగంలోనూ ప్రభుత్వం గొప్ప లక్ష్యాలతో ఉన్నత ఆశలతో ముందుకు సాగుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం చరిత్ర, ప్రకృతి ,పోరాటం ,పరిశ్రమల సమ్మేళనం. సీతారాములు నడయాడిన పవిత్ర నేల మనది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం, పర్ణశాల, గోదావరి , కిన్నెరసాని నదులు మన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు. సింగరేణి కెటిపిఎస్ హెవీ వాటర్ ప్లాంట్ ఐటిసి వంటి పెద్ద సంస్థలు అపార ఖనిజ సంపద గొప్ప ఆదివాసి సంస్కృతి మన జిల్లా ప్రత్యేకత. జిల్లాను వ్యవసాయ పరిశ్రమలు పర్యాటక విద్యా వైద్యం ఆదివాసి సంక్షేమం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఉభయ జిల్లాల రైతులకు సాగునీరు అందించే సీతారామ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నేస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువ, మూడు పంప్ హౌస్ లు పూర్తయ్యాయి ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా 1.
11 లక్షల ఎకరాలకు నాగర్జున సాగర్ ఆయకట్టుకు నీరు అందించాం. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ జిల్లాలో 1.57 లక్షల ఎకరాల కు కొత్తగా సాగునీరు మరో 43 వేల ఎకరాలకు స్థిరీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అశ్వాపురం మండలంలోని మారెళ్ళ పాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేస్తున్నాం. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వచ్చిన వెంటనే మిగులు పనులను ముందుకు తీసుకెళ్తాం. పెదబాబు తాళి పేరు కిన్నర సాని ప్రాజెక్టుల ద్వారా సుమారు 38 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. జిల్లాలోని చిన్న నీటిపారుదల పనుల ద్వారా సుమారు 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఏ ప్రాంతం అభివృద్ధికైనా మంచి రహదారులు మెరుగైన రవాణా సౌకర్యం ఎంతో ముఖ్యం అందుకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి నలువైపులా ప్రధాన ప్రాంతాలతో అనుసంధానించేలా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం.
జగదల్పూర్ - అమరావతి జాతీయ రహదారి నిర్మాణం పనులు పూర్తి చేసుకున్నాం. కొత్తగూడెం - హైదరాబాద్ వయా వలిగొండ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయి, కొత్తగూడెం - జగ్గయ్యపేట, భద్రాచలం - ఏటూరు నాగారం - కౌతాల రహదారులతో పాటు, కొత్తగూడెం- ములకలపల్లి - దమ్మపేట మీదుగా ఏలూరు వరకు డబల్ రోడ్ నిర్మాణానికి కొత్త ప్రతిపాదన రూపొందించడం జరిగింది. ఒక్క సెంటీమీటర్ జాతీయ రహదారులేని జిల్లాను జాతీయ రహదారులతో అనుసంధానించి కనెక్టివిటీ పెంచుతున్నాం. దీంతో వ్యవసాయం పరిశ్రమలు వ్యాపారం పర్యాటకం అభివృద్ధి చెంది కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. గోదావరి వరదల నుంచి భద్రాచలం ని కాపాడేందుకు కరకట్ట విస్తరణ పనులు సాగుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతలను పూర్తి చేసుకున్నాం. భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రూ 350 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా చేపడుతున్నాం. పాండురంగాపురం నుంచి మల్కాన్గిరి వరకు రైల్వే లైన్ మంజూరు కాగా భక్తుల సౌకర్యార్థం సారపాక వరకు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడేలా రైల్వే కనెక్టివిటీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగూడెంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఫీజిబిలిటీ రిపోర్టు ఆధారంగా సంబంధిత సంస్థల సూచనలను అనుగుణంగా భూసేకరణ తజన పనులు చేపడుతున్నాం. భద్రాచలంలో ఆదివాసి చరిత్ర సంస్కృతిని తెలియజేసేలా ట్రైబల్ మ్యూజియంను ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగూడెంలో మాసి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేశాం. భద్రాచలం పర్ణశాల కిన్నెరసాని వంటి ప్రాంతాలను కలిపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు మన ప్రాంత యువతకు కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి.. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో రహదారులు విద్యా వైద్యం తాగునీరు విద్యుత్ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. దేశ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు.






