9 June, 2026 | 1:14 AM

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

09-06-2026 12:00 AM

ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

మొక్కలు నాటుదాం, ప్రకృతిని కాపాడుదాం అంటూ పిలుపు

నాగోల్, జూన్ 8 (విజయక్రాంతి): ‘ప్రకృతిని ప్రేమిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షి ద్దాం‘ అనే సందేశంతో నాగోల్, బండ్లగూడ ప్రాంతాలకు చెందిన ఐకాన్ వాకర్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమానికి ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన జీవనశైలి, ప్రకృతి సంరక్షణ, పర్యా వరణ పరిరక్షణ లక్ష్యాలతో ఐకాన్ వాకర్స్ గ్రూప్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రకృతి పరిరక్షణలో భాగస్వాము లు కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాగే ప్రతిరోజూ నడక అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో వాకర్స్ గ్రూపుల పాత్ర కీలకమని అన్నారు.

ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఐకాన్ వాకర్స్ గ్రూప్ నిరంతరం కృషి చేస్తోందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ వాకర్స్ గ్రూప్ అధ్యక్షులు చెరుకు ప్రశాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ రమేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రమేష్, జాయింట్ సెక్రటరీ పెంటారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, సలహాదారులు ప్రతాప్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు చిరంజీవి, ఈశ్వర్ గౌడ్, సభ్యులు సీతారాములు తదితరులు మరియు పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు.