పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన వెడ్మ బొజ్జు పటేల్...
ఉట్నూర్, జూన్ 5 ( విజయ క్రాంతి ): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటాలని,పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత గా గుర్తించాలన్నారు. కలుషితం అవుతున్న ప్రకృతిని మొక్కలు నాటి కాపాడాల్సిన బాధ్యత ప్రజల పై ఉందని పిలుపునిచ్చారు.
ప్రకృతి కాపాడడంతోపాటు ప్లాస్టిక్ నిషేధం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉంటేనే ప్లాస్టిక్ నిషేధం జరుగుతుందని గుర్తు చేశారు. ప్రకృతి ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు ప్రకృతి పూజారులని గుర్తు చేయడంతో పాటు అడవిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






