6 June, 2026 | 1:44 AM

బీజేపీకి కార్యకర్తలే బలం

06-06-2026 12:16 AM

నిర్మల్ జూన్ 5 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా బీజేపీకి అసలైన బలం నిబద్దత గల కార్యకర్తలేనని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని బాలాజీ ఇన్ లో నిర్వహిస్తున్న దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అధ్యక్షతన జరుగుతున్న రెండు రోజుల శిక్షణ తరగతుల్లో బీజేపీ నాయకులేనుద్దెశించి మాట్లాడారు.

బీజేపీ పార్టీ స్థాపన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతావాదం, సిద్దాంతాలను కార్యకర్తలకు వివరించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు క్షేత్రస్థాయి నుండి నాయకులు సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జిల్లా పార్టీ నిర్వహిస్తున్న ప్రతిక్షణం శిబిరాలను సద్వినియోగం చేసుకొని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా మెలకువలు నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఇంచార్జ్ గోపిడి స్రవంతి రెడ్డి, భైంసా మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మోళ్ల దాత్తత్రి పటేల్, ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం మౌనిక మహేందర్,రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, మేడిశెమ్మే రాజు, ఆకుల శ్రీనివాస్,యథాళం చిన్నారెడ్డి, నల్లా రవీందర్ రెడ్డి, సత్యం చంద్ర కాంత్, ముత్యం రెడ్డి, మాదిరే శ్రీనివాస్, నల్లా రమేష్, పుస్పూర్ నర్సారెడ్డి, అర్జున్ ఠాకూర్, మండల అధ్యక్షులు, జిల్లా పాదాధికారులు, బీజేవైఎం నాయకులు, మండల ప్రధాన కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.