ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్
01-07-2024 09:35 PM
హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. తల్లి మానసికంలో పాల్గొనేందుకు నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం చంచల్ గూడ జైల్ లో ఉన్న రాధాకిషన్ రావు, మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల వరకు రెండు రోజుల పాటు బెయిల్ పై బయటకు రానున్నారు. రాధాకిషన్ రావు తల్లి సరోజినీ దేవి జూన్ 3వ తేదీన మృతి చెందారు. అనారోగ్య కారణాలతో జూన్ 2న రాత్రి కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ మరునాడు తుదిశ్వాస విడిచారు.






