18 July, 2026 | 12:26 PM

Breaking News

Vikram-1 రాకెట్ విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •  

గ్రామీణ ప్రాంతాలకు మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు : మంత్రి శ్రీధర్ బాబు

01-07-2024 09:20 PM

హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంత్రి శ్రీధర్ బాబును సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సోమవారం కలిశారు. మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని, డేటా సెంటర్ కు సంబంధించిన సమస్యలపై తెలుసుకున్నారు. డేటా సెంటర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, 22 ఎకరాలకు సంబంధించి భూసేకరణ సమస్యలున్నాయని మంత్రి శ్రీధర్ బాబుకు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు వివరించారు. భూసమస్యలను పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ ను ఆయన ఆదేశించారు. సబ్ స్టేషన్లు, కాల్వల నిర్మాణం గడువులోపు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.