7 July, 2026 | 10:56 PM

ఓజీ కోసం ప్రత్యేకంగా

19-12-2024 12:00 AM

పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం గురించి తాజాగా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా బ్యాంకాక్‌లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు సమాచారం. ఇప్ప టికే చిత్రంలో పలు భాషలకు చెందిన నటులు భాగమయ్యారు.

హీరోయిన్‌గా ప్రియాంక మోహనన్ నటిస్తున్నారు. మరో తమిళ నటి శ్రీయ రెడ్డి సైతం ఈ చిత్రంలో భాగమవనుందని సమాచారం. అలాగే నేహా శెట్టి సైతం ‘ఓజీ’లో భాగమవనుందంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దాదాపుగా ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్‌ను పెడుతున్నారు. అలాంటి ఒక స్పెషల్ సాంగ్‌నే ‘ఓజీ’లోనూ సుజిత్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట.

దీని కోసం నేహా శెట్టిని సైతం ఒప్పించారని.. దానికి సంబంధించి షూటింగ్ కూడా నిర్వహి స్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్పెష ల్ సాంగ్‌లో పవన్ స్టెప్పు లు వేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. పవన్ స్టెప్పులు వేస్తే మాత్రం పాట ఎక్కడికో వెళుతుందని అభిమానులు అంటున్నారు.