సీక్వెల్ బాటలో తొలిసారిగా..
సినిమాల ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ప్రస్తుతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. ఒక సినిమా వచ్చిందంటే అది చిన్నదైనా, పెద్దదైనా దాదాపుగా సీక్వెల్ ఉండి తీరుతోంది. అయితే స్టార్ హీరోలంతా సీక్వెల్ బాట పట్టినాకూడా మహేశ్ బాబు మాత్రం ఎందుకో ఆదిశగా ఇప్పటి వరకూ పయనించలేదు. కానీ ఇప్పుడు రాజమౌళితో చేయనున్న చిత్రం రెండు పార్టులుగా రూపొందనుందంటూ టాక్ నడుస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ29గా రూపొంద నున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం.
అయితే ఈ సినిమాను రెండు పార్టులుగా రూపొందించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట. తొలి భాగం 2027లో, రెండోభాగం 2029లో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలా తీస్తే మాత్రం దాదాపు ఐదేళ్ల పాటు రాజమౌళి దగ్గర మహేశ్ బుక్ అయినట్టే. ఈ చిత్రంతో ఇంటర్నేషనల్ లెవల్‌లో సత్తా చాటాలని రాజమౌళి భావిస్తున్నారట. కాబట్టి హాలీవుడ్ స్టాండర్డ్స్‌కి ఏమాత్రం తగ్గకుండా సినిమా చేస్తారట. దుర్గా ఆర్ట్స్‌తోపాటు ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ స్టూడియో కూడా నిర్మాణంలో భాగం కానుందని ప్రచారం జరుగుతోంది.






