15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహిళల అభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు

25-06-2025 10:25 PM

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం(Orientation Program)ను సెర్ప్, వి-హబ్, డి ఆర్డి ఏ ఆధ్వర్యంలో  నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆవరణలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish), అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) మొక్కలు నాటారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి ఇంటిలో ఒక మహిళ ప్రాథమికంగా చిన్న పారిశ్రామికవేత్తగా అంచెలంచలుగా ఎదగడానికి ఇది ఒక పునాది అని పేర్కొన్నారు.

దీనిలో భాగంగానే జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ, వి-హబ్ అధికారులతో పలుమార్లు సుదీర్ఘంగా చర్చించి పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్, మహిళా డెయిరీ తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కలెక్టర్, అధికారుల సహకారంతో దేశంలోనే పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కు ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. దీనికి మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... మహిళలు సాధికారతను సాధించితే అత్యున్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల అభివృద్ధికి విహబ్ ను ఏర్పాటు చేసిందన్నారు. వీ హబ్ సీఈవో సీత మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక బలాన్ని వీ హబ్ అందించి ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పరకాల ఆర్డీవో డాక్టర్ కె.నారాయణ, దామెర తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, వీ హబ్ ప్రతినిధులు, పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.