12 March, 2026 | 9:21 AM

టీజీఆర్‌పీడీసీఎల్ డిస్కం ఏర్పాటు

12-03-2026 02:07 AM
  1. రైతు డిస్కంగా పేర్కొంటూ సర్కార్ ఉత్తర్వులు జారీ

వ్యవసాయం, మంచినీటి, మిషన్ భగీరథ లాంటి పథకాలకు చోటు

చైర్మన్, నలుగురు డైరెక్టర్ల నియాకం

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి) : ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపె నీ లిమిటెడ్’ పేరుతో రాష్ట్రంలో మూడో విద్యుత్తు డిస్కం (టీజీఆర్‌పీడీసీఎల్) ను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (ఇంధన శాఖ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మూడో డిస్కంను ‘రైతు డిస్కం’గా పేర్కొంటారనికూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ డిస్కం పరిధిలోకి వచ్చే అం శాలు, అలాగే చైర్మన్, నలుగురు డైరెక్టర్లను నియమిస్తూ ఈ ఉత్తర్వులను జారీచేశారు. దీ నికి సంబంధించిన రిజిస్టర్డ్ కార్యాలయాన్ని మింట్ కాంపౌండ్‌లో ప్రస్తుతం ఉన్న ఎస్‌పీడీసీఎల్ కార్యాలయం బీ బ్లాక్ రెండో అంత స్తులో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.

రైతులు.. నీటి పథకాలు 

ఈ రైతు డిస్కం పరిధిలోకి వ్యవసాయ విభాగాన్ని చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లన్నీ ఈ డిస్కం పరిధిలోకే వస్తాయన్నమాట. దీనితోపాటు ఎత్తి పోతల పథకాలు (ఎల్‌ఐఎస్), రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్), మిష న్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వా టర్ సప్లు అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ), ప్రత్యేక డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లతో అనుసంధానమైన మున్సిపల్ నీటి కనెక్షన్లు (ఎల్టీ 4 ఈ డిస్కం పరిధిలోకి తీసుకొచ్చినట్టు ఆ ఉత్తర్వు ల్లో స్పష్టంగా పేర్కొన్నారు. 

టీజీఆర్‌పీడీసీఎల్ డిస్కం.. ఇకపై దాని పరిధిలోకి వచ్చే ఆయా విభాగాలకు సంబంధించిన వినియోగదారులకు విద్యుత్తు సర ఫరా, కొత్త కనెక్షన్లను చూసుకుంటుంది. దీనితోపాటు కావాల్సిన పవర్ పర్చేజ్ అగ్రిమెం ట్లను (పీపీఏ) చేసుకుంటుంది. డీటీఆర్, ఎల్టీ లైన్లకు సంబంధించి ఆపరేషన్స్ అండ్ మే యింటెటెన్స్ చూసుకుంటుంది. ఆయా రం గాలు వినియోగిస్తున్న విద్యుత్తుకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు, ఆర్థిక అంశాల ను చూస్తుంది. విద్యుత్తు నియంత్రణ మండలిలో నిర్దేశిత సమయం ప్రకారం ఫైలింగ్ చే స్తుంటుంది. నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తును వినియోగదారులకు అందిస్తుంది.

డైరెక్టర్ల నియామకం 

ఈ డిస్కం పరిపాలన, కార్యనిర్వహణ చూసుకునేందుకు చైర్మన్, నలుగురు డైరెక్టర్లను నియమించింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ పారూఖీని నియమించారు. అలాగే డైరెక్టర్లుగా వంటేరు తిరుపతి రెడ్డి (ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్), పి.క్రిష్ణారెడ్డి (ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్), వంగూరు మోహన్‌రావు (ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్), ఎన్.నర్సింహులు (ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్)లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ డిస్కంకు కావాల్సిన మానవ వనరులను ఇప్పుడు ఉన్న డిస్కంల నుంచి డిప్యూటేషన్‌పై, అలాగే రిక్రూట్‌మెంట్ చేసుకుంటారని అందులో పేర్కొన్నారు.