ఏళ్లు గడిచినా రోడ్డు వేయరా?
సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
ముకరంపుర, డిసెంబరు 25 (విజయ క్రాంతి): నగరంలోని కట్ట రాంపూర్ నుండి కోతి రాంపూర్ వెళ్లే రహదారి గతకొన్ని సంవత్సరాలుగా వాహనాలు, పాదాచారులు నడవలేని దుస్థితిలో ఉందని, దీనిని బాగు చేయడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలం చెందారని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం సిపిఐ ఆధ్వర్యం లో కటరాంపూర్ నుండి కోతి రాంపూర్ వెళ్లే గుంతలుగా ఉన్న రోడ్డు ను పరిశీలించారు.ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో పైన పటారం లోన లోటా రంలాగా రోడ్లు నిర్మాణం జరుగుతుందని, ప్రధాన రహదారులను బాగు చేస్తున్నారు తప్ప అంతర్గత రహదారులను పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆరోపించారు.
ఈ రహదారి పను లను, నగరంలో అద్వానంగా మధ్యలో వదిలిపెట్టిన రోడ్లను వెంటనే పనులు ప్రారంభించి అం దుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేనిపక్షంలో నగర ప్రజలతో మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి నగర కార్యవర్గ సభ్యులు కసిబోజుల సంతోష చారి, గామినేని సత్యం, అనంతగిరి, రమేష్ మాదాసు రాములు, శంకర్, సందీప్, నాగరాజు, బ్రహ్మం, శ్రీ వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.






