నవరాత్రి ఉపవాసంలో ఉన్నా
కిమ్ జోంగ్, జార్జ్ సోరోస్‌లో ఎవరితో డిన్నర్ చేస్తారని ప్రశ్నించిన యాంకర్
వైరల్ అవుతున్న జైశంకర్ సమాధానం
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. మీరు డిన్నర్ చేయాలనుకుంటే.. కిమ్‌జోంగ్ ఉన్ లేదా జార్జ్ సోరోస్‌లలో ఎవరిని ఎన్నుకుంటారని ప్రసెంటర్ ప్రశ్నించగా.. జైశంకర్ స్పందిస్తూ.. ‘ఇప్పుడు నవరాత్రులు కదా.. నేను ఉపవాసం ఉన్నాను’ అని బదులిచ్చారు.
దీంతో అక్కడున్న ప్రేక్షకులు, యాంకర్స్ ఒక్కసారిగా నవ్వారు.కాగా జార్జ్ సోరోస్ అనే అమెరికన్.. యాంటీ ఇండియా, యాంటీ హిం దూ భావనలు ఉన్న వ్యక్తిగా అతడిపై ఆరోపణలున్నాయి. భారత్ వ్యతిరేక ఉద్యమాలకు నిధులు సమకూరుస్తున్నాడనే అభియోగాలు కూడా అతడిపై ఉన్నాయి.
ముఖ్యంగా భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రయత్నిస్తున్నాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నార్త్ కొరియా అధినేతగా, నియంతగా కిమ్ చేసే మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తూ ఉంటాయి.






