సనాతన ధర్మంపై ప్రకాశ్ రాజ్ కామెంట్స్
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఇటీవల జరుగుతున్న పరిణామాలపై తరుచూ స్పందిస్తున్న సినీనటుడు ప్రకాశ్‌రాజ్ ఆదివారం ఎక్స్‌వేదికగా సనాతన ధర్మంపై తన స్పందించారు. ‘సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమా జ రక్షణలో మేముంటాం. ఆల్ ది బెస్ట్ # జస్ట్ ఆస్కింగ్’ అని కామెంట్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం షురూ అయి నప్పటి నుంచి ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఈ క్రమంలో తిరుపతిలో గురువారం నిర్వహించిన వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై మాట్లాడుతూ త్రికరణశుద్ధిగా సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా.. వారాహి డిక్లరేషన్‌ను వేంకటేశ్వరుని పాదా ల సాక్షిగా ప్రకటిస్తున్నానని చెప్పారు. ‘నేను ముమ్మాటికీ సనాతన హిందువునే. నా ప్రాణాల్ని అడ్డుపెట్టయినా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటా. దాని కోసం నా రాజకీయ హోదాను, పదవిని, అధికారాలనే కాదు.. నా ప్రాణాల్ని కోల్పోవడానికి కూడా సిద్ధం’ అని అన్నారు.






