5 May, 2026 | 3:07 PM

టూరిజం స్పాట్‌గా ఉండ్రుగొండ

07-10-2024 12:20 AM

సూర్యాపేట, అక్టోబర్ 6 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా  చివ్వెంల మండల పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉండ్రుగొండను రాష్ట్రంలోనే నంబర్ వన్ టూరిజం స్పాట్‌గా మారుస్తానని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఉండ్రుగొండను సందర్శించా రు. దేవాలయంతో పాటు పరిసరాల ను అభివృద్ధి చేసేందుకు రూ.2.5 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపా రు. ఈ ప్రాంత సందర్శనకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.