సోదాలు జరుగుతున్నా తగ్గేదెలె?
- ఏసీబీ సోదాలు జరుగుతున్నా బల్దియాల్లో తగ్గని అవినీతి
అవినీతి అక్రమాలకు నిలయాలుగా మారిన కార్యాలయాలు
భవనాల అనుమతులకు పెద్దమొత్తంలో డిమాండ్
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మున్సిపల్ అధికారులు
మున్సిపల్ నిధులు మళ్లించి సస్పెన్షన్‌కు గురైన దుండిగల్ టీపీఎస్
మేడ్చల్, మార్చి 17 (విజయక్రాంతి): మున్సిపల్ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తరచూ దాడులు చేస్తున్నప్పటికీ అవినీతి తగ్గడం లేదు. ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు పలు మున్సిపల్ కార్యాలయాల్లో ఆకస్మిక సోదా లు జరిపారు. లంచాలు డిమాండ్ చేసిన సమయంలోనే కాకుండా, అవినీతి ఆరోపణలు వచ్చిన మున్సిపల్ కార్యాలయా ల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
అయినప్పటికీ మున్సిపల్ కార్యా లయాల్లో అవినీతి అక్రమాలు తగ్గడం లేదు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల కా లంలో పదుల సంఖ్యలో మున్సిపల్ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు చిక్కారు. మరొకరు నిధులు మళ్లించినందుకు సస్పెన్షన్కు గురయ్యారు. సైబరా బాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుతుబుల్లాపూర్ జోన్ పరిధిలో రెండు సర్కిల్ కార్యాలయాల్లో రెండు రోజులు వరుసగా సోదాలు నిర్వహించారు. అవినీతి అక్ర మాలకు పాల్పడుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాల నిర్వహించారు.
చింతల్, దుండిగల్ కార్యాలయా ల్లో సోదాల నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు లోపాలు గుర్తించారు. దుండిగల్ కార్యాలయంలో ఫిబ్రవరి 17న ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైరహాజరయ్యారని, శానిటేషన్ సిబ్బంది రికార్డులలోని సంఖ్య ప్రకారం డ్యూ టీలో లేరని, తక్కువమంది ఉన్నారని, అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోలేదని గుర్తించారు.
నిధులు మళ్లించిన టీపీఎస్ సస్పెన్షన్..
దుండిగల్ సర్కి ల్ కార్యాలయంలో సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తిం చడమే గాక టీపీఎస్ సంజన నిధు లు మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. టీపీఎస్ సంజన మున్సిపాలిటీకి చెందిన నిధులను తన భర్తకు చెందిన కంపెనీలోకి మళ్లించినట్లు గుర్తించారు. ఈ మెను నాలుగు రోజుల క్రితం సస్పెండ్ చేశారు. ఈమెపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్‌లో విలీనం కాకముందు దుండిగల్ మున్సిపాలిటీతోపాటు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో అదనపు బాధ్యతలు నిర్వహించేవారు. ఈమె హయాంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగాయి.
ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలాలు..
మేడ్చల్ జిల్లాలో మూడు నెలల వ్యవధిలో అనేకమంది మునిసిపల్ సిబ్బంది ఏసీబీ అధికారులకు చిక్కారు. ఇందులో భారీ తిమింగలాలు ఉన్నాయి. కూకట్పల్లి కార్యాలయంలో ఎస్‌ఈ పొద్దుటూరు చిన్నారెడ్డి భారీ మొత్తంలో లంచం తీసుకుని ఏసీ బీకి చిక్కారు. ఎల్లంపేట మున్సిపా లిటీలో టీపీఎస్ రాధాకృష్ణారెడ్డి ఐదు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికా రులకు దొరికారు.
ఫిబ్రవరి మూడో వారం లో చింతల్ సర్కిల్ కార్యాలయంలో అధికారులు సోదాల నిర్వహించి టాక్స్ ఇన్స్పెక్టర్ వహీదును అదుపులోకి తీసుకున్నారు. వహీద్ గాజులరామారం సర్కిల్లో పనిచేసిన సమయంలో భగత్ సింగ్ నగర్ లో ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తికి మ్యూటేషన్ చేసి ఆస్తి మదింపు చేయడానికి 90 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మొదట పదివేల రూపాయలు ఇవ్వగా మిగతా డబ్బుల కోసం వేధించాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బహిరంగంగానే డిమాండ్..
బల్దియా అధికారులు ఏసీబీ అధికారులకు దొరికి కటకటాల పాలైనప్పటికీ మిగతా ధికారుల్లో ఏ భయం కనిపించడం లేదు. మున్సిపాలిటీలు, సర్కిల్ కార్యాలయాల్లో పట్టణ విభాగం అధికారులు బహిరంగంగా నే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నూతన భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి డబ్బులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నా రు. అంతేగాక అక్రమ నిర్మాణాలను సైతం ప్రోత్సహిస్తున్నారు.
డబ్బులు ఇస్తే చాలు అక్రమ నిర్మాణం వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదు. అనుమతులు ఒకలా తీసుకొని నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టు అనుమతి తీసుకొని నాలుగైదు అంతస్తులు నిర్మించిన చర్యలు తీసు కోవడం లేదు. కొన్నిచోట్ల రెసిడెన్షియల్ అనుమతి తీసుకుని కమర్షియల్ నిర్మిస్తున్నారు. ఇలా అక్రమ నిర్మాణాలు చేపట్టి మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నా రు. ఏసీబీ అధికారులు రెగ్యులర్‌గా సోదాలునిర్వహించి అవినీతి, అక్రమాలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.




