1 July, 2026 | 11:50 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు!

10-06-2025 12:00 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘అఖండ2: తాండవం’. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో కొనసాగుతోంది. అక్కడి అందమైన లొకేషన్లలో అద్భుతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ మూవీ మేకర్స్ సోమవారం టీజర్‌ను విడుదల చేశారు.

ఈ సినిమాను దసరా కానుకగా ఇదే ఏడాది సెప్టెంబర్ 25న థియేటర్ల ద్వారా విడుదల చేయనున్నట్టు ఈ సందర్భంగా టీమ్ అధికారికంగా ప్రకటించింది. టీజర్‌లో త్రిశూలం, నంది, మంచుతో కప్పబడిన కైలాసం నేపథ్యం మెస్మరైజ్ చేశాయి. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.

నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా’ అంటూ అఘోర పాత్రలో బాలకృష్ణ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది. సంయుక్త కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీథం: తమన్; డీవోపీ: సీ రామ్‌ప్రసాద్, సంతోష్ డీ; ఫైట్స్: రామ్ ఆర్ట్: ఏఎస్ ప్రకాశ్; ఎడిటర్: తమ్మిరాజు.